Thursday 26 April 2012

బ్లాగయణం-2

కొంతమంది బ్లాగర్లు చక్కగా తాము సరుకు ఉన్న టపాలు రాయగలము అనుకున్నప్పుడే రాస్తూ ఉంటారు. అంతే కానీ వయసయిపోయినా జనాల చప్పట్ల కోసం వెంపర్లాడే హీరో లాగ రాసే ఇంకొంతమందీ ఉంటారు.

నెమలికన్ను మురళీ గారు మొదటికోవ కి చెందుతారు. ఆయన రాతలు ఎన్ని సార్లు చదివినా బోరు కొట్తవు. రాయలేను అనుకున్నప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుని తనలో రాయగలిగే శక్తి వచ్చిందీ నుకున్నప్పుడే మరలా మొదలుపెట్టారు.

ఇంకొంతమంది ఉంటారు తాము ఒకప్పుడు చప్పట్లు కొట్తించుకున్న బాపతు కాబట్టి అదే లెవెల్ ల్లో అన్ని తపాలూ రాయాలని ప్రయత్నించి బొక్కబోర్ల పడుతూ ఉంటారు.

చీమిడీ ముక్కు ని "గంగా గోదావరి "కాలువలగా అభివర్ణించడం లాంటి పిచ్చి కామెడీ తో జనాల బుర్రలు తినెస్తూ ఉంటారు. లేదా అప్పుడెప్పుడో చేతకాక ఆపేసిన కళల గురించి కూడా పేద్ద బిల్డప్పు ఇచ్చేసి రాసేసి అదో టపా అనుకునే ఘనులు వీరు.

అసలు ఈ కామెంట్లు ఉన్నాయే ఇవి అసలు మ్యాచ్ ఫిక్సింగ్ కంటే ఘోరం. సరుకు లేకపోయినా కొన్ని బ్లాగుల్లో కుప్పల కామెంట్లు. రాసిన కొంచమైనా మేటర్ తో రాసే ఇండియన్ మినర్వా లాంటి బ్లాగులని పట్టించుకునే నాధుడే ఉండడు.
పేరున్న బ్లాగర్ ఒక కవిత(?) రాస్తే దానికి ఆహా ఓహోలు, తన ప్రేమ గురించి అంత కన్నా బాగా రాసుకునే ఓ ప్రేమికుడి బ్లాగు కామెంట్ల సెక్షన్ మాత్రం ఖాళీ.

అన్నంతో ఆవడలు,కుంకుడుకాయ కారపు పచ్చడులు రాసే బ్లాగర్లు కోకొల్లలు. కానీ ఇదే వంట జ్యోతి గారు రాస్తే వీరతాళ్ళు, ఇంకో బ్లాగులో వస్తే కామెంట్లు పెట్తే నాధుడే ఉండడు పాపం.

త్రినేత్రుడి మొదటి టపా–బ్లాగాయణం

ఈ బ్లాగులున్నాయి చూసారూ, ఒకటే బోరు కొట్టేసాయంటే నమ్మండి. కొన్ని రోజులు బాగానే మజా అనిపించింది. రాను రాను కంటెంట్ కానివ్వండి రాసే విధానం కానివ్వండి ఏదైతేనేమి బోరు కోట్టేసింది.

కొత్తలో బ్లాగుండేవి ఈ బ్లాగులు. ఇప్పుడేముంది ఒకరు పల్లెటూరి గురించో గుంట పొంగణాల గురించో రాయగానే పొలో మని ఇక ఇవే కబుర్లు. కామెంటులూ సేం అన్నింటికీ. కామెంటర్లలో కొంతమంది కామెంటర్లు వేరయా అన్నట్లు వీరిని “కెవ్వు కేక” కామెంటర్లు అనాలి అన్నమాట. సాధారణం గా వీరి కామెంటు లో ఈ పదం తప్ప వేరేది ఏదీ కనపడదు.
అందుకే పెద్ద వారు ఆలశ్యం గా చెప్పినా కానీ అసలు విషయం చెప్పారు మన బులుసు వారు అటూ ఇటూ గా అందరి లెక్కలూ ఇవే అని ఈ మధ్య ఆయన బ్లాగు వార్షికోత్సవపు టపా లో.

బులుస్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పుకుందాము. నిజం చెప్పొద్దూ మొదట ఆయన బ్లాగు చదవలేదు నేను ఆ బ్లాగు పేరు చూసి. ఆ ఏముంది లే అక్కడా ఇక్కడా ఎత్తుకొచ్చిన జోకులు కాపీ పేస్టు చేసే బ్లాగయ్యుంటుంది లే అని.తరువాత బ్లాగులో సరుకు ఉందన్న సంగతి గ్రహించేసరికి ఆయన మన బ్లాగర్ల భాషలో చెప్పాలంటే భ్రహ్మాండ భీబత్స రచ్చ కేక బ్లాగరయ్యి కూర్చున్నారు.

అప్పుడప్పుడు జంధ్యాల సినిమాలు కూడా ఫ్లాపయినట్లు కొన్ని టపాలు అంత నవ్వు తెప్పించవు కానీ ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తున్నారు ఈయన.

ఇంకొంతమంది కామెడీ కింగులు,క్వీనులు,పట్టపురాణీలు అంటున్నారు కానీ ఎందుకో నాకు వాటిల్లో నవ్వురాని కామెడీ ఎక్కువ అనిపిస్తుంది….పూలు బ్లాగరు ఒక వెర్సటైల్ రచయిత సినిమాలలో మన కోటా లాగ.ఆవిడ శైలి ని మన బ్లాగర్లందరూ కలిసి పూనుకుని మరీ ఆ శైలిని చంపేసారు అనిపిస్తోంది.

ఎంత సేపూ కెవ్వు కేక రచ్చ ఇవేనా కామెంట్లంటే.నిజం గా బాగుంటే పొగడటం లో తప్పు లేదు.శక్తి నో బద్రీనాధ్ నో సూపర్ హిట్టంటోంటే మనకి అసలు సంగతి తెలీదూ? కొన్ని పోస్టు లు అంత బాగుందవు అయినా కుప్పలు తెప్పలుగా సేం టూ సేం కామెంట్స్.నిజం చెప్పొద్దూ ఆవిడ శైలి చచ్చిపోయింది ఈ మధ్య.

ఇంకొంతమంది బ్లాగర్లుంటారు పేరంటం బ్లాగర్లంటారు వీళ్ళని. అర్ధం కాలేదా,పేరంటానికి వెళ్తారు ఆడవాళ్ళు.అసలు పిలిచినది సుబ్బమ్మ,వెళ్ళినది వెంకమ్మ అనుకుందాము.అక్కడ ఓ లచ్చమ్మ కలిసి ఈ వెంకమ్మ గారిని ఓ మీరా మీ గురించి తెలుసు ఓ సారి మా ఇంటికి వచ్చి వాయనం తీసుకెళ్ళండి అంటే వేంఠనే వెంకమ్మ లచ్చమింటికి వచ్చి హాజరేయించుకుని వెళ్ళిపోతుంది అంతే. మరలా ఈ లచ్చమ్మ మొహం వెంకమ్మ చూడదు. అలాగన్నమాట వీళ్ళు తమ బ్లాగుల్లో ఎవరైనా కొత్తగా వచ్చి వ్యాఖ్య పెడితే ఓ మారు అలా వ్యాఖ్య పెట్టిన ఆవిడ/ఆయన లేటెస్ట్ పోస్టు కి తప్పక కామెంటు పెట్టి మరలా ఆ బ్లాగు మొహం చూడరు.

ఇంకొంత మంది బ్లాగర్లుంటారు “రోష”న్ “రోషి”నీ బ్లాగర్లంతారు వీళ్ళని. వరుసగా పొగడ్తల మధ్య ఓ చిన్న సజెషనో విమర్శ వచ్చినా తట్టుకోలేరు వీళ్ళు.వేంఠనే తమ బ్లాగు ని ఆహ్వానించిన వారికి మాత్రమే అని బోర్డోటి తగిలించెస్తారు వారి గుమ్మంకి.అసలు విషయం తెలీని నా లాంటి వారు ఆ గుమ్మం లోకి వెళ్తే ఆ బోర్డు వెక్కిరిస్తుంది నిన్ను పిల్చానా,ఎందుకు వచ్చావు రావాలంటే మా ఓనర్ ని అడుక్కో ఫో అని. వేగుల ద్వారా బజ్జుల్లో జరిగే సంభాషణ గ్రహించి దాని సారాంశాన్ని కాచి వడపోస్తే కానీ ఓ ఇదా జరిగింది అని మనకు అర్ధం కాదు.
ఇక్కడ ఆపెస్తాను ఈ పురాణాన్ని. మరలా రేపు.