Thursday 26 April 2012

త్రినేత్రుడి మొదటి టపా–బ్లాగాయణం

ఈ బ్లాగులున్నాయి చూసారూ, ఒకటే బోరు కొట్టేసాయంటే నమ్మండి. కొన్ని రోజులు బాగానే మజా అనిపించింది. రాను రాను కంటెంట్ కానివ్వండి రాసే విధానం కానివ్వండి ఏదైతేనేమి బోరు కోట్టేసింది.

కొత్తలో బ్లాగుండేవి ఈ బ్లాగులు. ఇప్పుడేముంది ఒకరు పల్లెటూరి గురించో గుంట పొంగణాల గురించో రాయగానే పొలో మని ఇక ఇవే కబుర్లు. కామెంటులూ సేం అన్నింటికీ. కామెంటర్లలో కొంతమంది కామెంటర్లు వేరయా అన్నట్లు వీరిని “కెవ్వు కేక” కామెంటర్లు అనాలి అన్నమాట. సాధారణం గా వీరి కామెంటు లో ఈ పదం తప్ప వేరేది ఏదీ కనపడదు.
అందుకే పెద్ద వారు ఆలశ్యం గా చెప్పినా కానీ అసలు విషయం చెప్పారు మన బులుసు వారు అటూ ఇటూ గా అందరి లెక్కలూ ఇవే అని ఈ మధ్య ఆయన బ్లాగు వార్షికోత్సవపు టపా లో.

బులుస్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పుకుందాము. నిజం చెప్పొద్దూ మొదట ఆయన బ్లాగు చదవలేదు నేను ఆ బ్లాగు పేరు చూసి. ఆ ఏముంది లే అక్కడా ఇక్కడా ఎత్తుకొచ్చిన జోకులు కాపీ పేస్టు చేసే బ్లాగయ్యుంటుంది లే అని.తరువాత బ్లాగులో సరుకు ఉందన్న సంగతి గ్రహించేసరికి ఆయన మన బ్లాగర్ల భాషలో చెప్పాలంటే భ్రహ్మాండ భీబత్స రచ్చ కేక బ్లాగరయ్యి కూర్చున్నారు.

అప్పుడప్పుడు జంధ్యాల సినిమాలు కూడా ఫ్లాపయినట్లు కొన్ని టపాలు అంత నవ్వు తెప్పించవు కానీ ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తున్నారు ఈయన.

ఇంకొంతమంది కామెడీ కింగులు,క్వీనులు,పట్టపురాణీలు అంటున్నారు కానీ ఎందుకో నాకు వాటిల్లో నవ్వురాని కామెడీ ఎక్కువ అనిపిస్తుంది….పూలు బ్లాగరు ఒక వెర్సటైల్ రచయిత సినిమాలలో మన కోటా లాగ.ఆవిడ శైలి ని మన బ్లాగర్లందరూ కలిసి పూనుకుని మరీ ఆ శైలిని చంపేసారు అనిపిస్తోంది.

ఎంత సేపూ కెవ్వు కేక రచ్చ ఇవేనా కామెంట్లంటే.నిజం గా బాగుంటే పొగడటం లో తప్పు లేదు.శక్తి నో బద్రీనాధ్ నో సూపర్ హిట్టంటోంటే మనకి అసలు సంగతి తెలీదూ? కొన్ని పోస్టు లు అంత బాగుందవు అయినా కుప్పలు తెప్పలుగా సేం టూ సేం కామెంట్స్.నిజం చెప్పొద్దూ ఆవిడ శైలి చచ్చిపోయింది ఈ మధ్య.

ఇంకొంతమంది బ్లాగర్లుంటారు పేరంటం బ్లాగర్లంటారు వీళ్ళని. అర్ధం కాలేదా,పేరంటానికి వెళ్తారు ఆడవాళ్ళు.అసలు పిలిచినది సుబ్బమ్మ,వెళ్ళినది వెంకమ్మ అనుకుందాము.అక్కడ ఓ లచ్చమ్మ కలిసి ఈ వెంకమ్మ గారిని ఓ మీరా మీ గురించి తెలుసు ఓ సారి మా ఇంటికి వచ్చి వాయనం తీసుకెళ్ళండి అంటే వేంఠనే వెంకమ్మ లచ్చమింటికి వచ్చి హాజరేయించుకుని వెళ్ళిపోతుంది అంతే. మరలా ఈ లచ్చమ్మ మొహం వెంకమ్మ చూడదు. అలాగన్నమాట వీళ్ళు తమ బ్లాగుల్లో ఎవరైనా కొత్తగా వచ్చి వ్యాఖ్య పెడితే ఓ మారు అలా వ్యాఖ్య పెట్టిన ఆవిడ/ఆయన లేటెస్ట్ పోస్టు కి తప్పక కామెంటు పెట్టి మరలా ఆ బ్లాగు మొహం చూడరు.

ఇంకొంత మంది బ్లాగర్లుంటారు “రోష”న్ “రోషి”నీ బ్లాగర్లంతారు వీళ్ళని. వరుసగా పొగడ్తల మధ్య ఓ చిన్న సజెషనో విమర్శ వచ్చినా తట్టుకోలేరు వీళ్ళు.వేంఠనే తమ బ్లాగు ని ఆహ్వానించిన వారికి మాత్రమే అని బోర్డోటి తగిలించెస్తారు వారి గుమ్మంకి.అసలు విషయం తెలీని నా లాంటి వారు ఆ గుమ్మం లోకి వెళ్తే ఆ బోర్డు వెక్కిరిస్తుంది నిన్ను పిల్చానా,ఎందుకు వచ్చావు రావాలంటే మా ఓనర్ ని అడుక్కో ఫో అని. వేగుల ద్వారా బజ్జుల్లో జరిగే సంభాషణ గ్రహించి దాని సారాంశాన్ని కాచి వడపోస్తే కానీ ఓ ఇదా జరిగింది అని మనకు అర్ధం కాదు.
ఇక్కడ ఆపెస్తాను ఈ పురాణాన్ని. మరలా రేపు.

4 comments:

  1. బాబోయ్! ఏంటండీ మీరు? బ్లాగుల మీదా, బ్లాగర్ల మీదా రిసెర్చ్ గాని చేసారా ఏంటి ;)

    ReplyDelete
  2. ఎవరికి తోచింది వారు రాసుకుంటారండి త్రినేత్రుడు గారు.మీకిష్టమైతే చూడండి. లేకపొతే ignore చేసెయ్యండి. అన్నీ మనకు interesting గా ఉండేవే రాయలని లేదు కదా? అయినా మీకు కూడా ఈ రోజు నచ్చినవి రేపు నచ్చాలని లేదు కదా.. ప్రతి ఒక్కరు తమకు తోచింది ఏదో రాసుకోవాలని తాపత్రయపడతారు. వారు రాసినది అందరికీ నచ్చాలని కాని, అందులో పెద్దగా అర్ధం ఉండాలని ఎందుకు అనుకోవాలి చెప్పండి.ఒకటి మాత్రం చెప్పగలను, కొన్ని బ్లాగ్స్ మనం చదువుతూ ఉంటే కొంతమంది రచనా శైలి, కొన్ని కవితలు మనకు నచ్చుతాయి. అందుకని స్పందిస్తాము. నేనైతే నేను చదివిన ప్రతి బ్లాగ్ లోను స్పందిస్తాను. నాకు చిరు నవ్వును తెప్పించినా, నాకు తెలియని విషయాలు తెలిపినా.. నేను ఒక 5 mins spend చేస్తే ఏ బ్లాగ్ లో అయినా నేను స్పందిస్తాను. నా స్పందన గొప్పగా ఉండదు.ఒక్క లైన్ అన్నా...బాగుంది అనో , బాగా రాసారు అనో, I just want to let them know I read whatever they posted. Its just a courtesy.నేను అలా చేస్తున్నాను కదా అని నేను స్పందించిన బ్లాగ్ writers అందరు నా పోస్ట్స్ కి స్పందించాలని నేను కోరుకోను, ఆశించను.నాకు రాయాలనిపించి నేను రాసుకుంటాను కాని ఎవరి కోసమో రాయను కదండి. మీ opinion మీరు చెప్పటాన్ని నేను తప్పు పట్టను. కాని కొంతమందినన్నా మీరు hurt చేస్తున్నరు కదా మీ అభిప్రాయాలన్ని బహిర్గతం చేసి? అలోచించండి!

    ReplyDelete
  3. కానివ్వండి, పూర్తి చేయండి.

    ReplyDelete
  4. రసఙ గారూ,

    అదేమీ లేదండీ. బ్లాగులు,బ్లాగర్ల తీరు తెలిపానంతే. మీకు అన్ని విషయాలపై ఉన్న అవగాహన సూపర్ అండీ.

    జలతారు వెన్నెల గారూ

    అవునండీ ఎవరు ఇష్టమైనవి వారు రాసుకోవచ్చు కాదనట్లేదు కానీ బాగాలేకపోతే బాలేదు అనే చెప్తాము కదా.

    సినిమాల గురించి అనుకోమూ అబ్బా ఫలానా సినిమా బోర్ అనీ, అలాగే.ఇక స్పందన అంటారా స్పందించడం అనేది వ్యక్తిగత ఇంట్రస్టు కానీ ఫలానా బ్లాగర్లు రాస్తే స్పందించే టైమున్నవాళ్ళు అదే కంతెంటు తో వేరే వాళ్ళు రాస్తే స్పందించరేమి అనే నేను అడిగినది.

    శర్మ గారూ,

    ధన్యవాదాలండీ

    ReplyDelete