Thursday 26 April 2012

బ్లాగయణం-2

కొంతమంది బ్లాగర్లు చక్కగా తాము సరుకు ఉన్న టపాలు రాయగలము అనుకున్నప్పుడే రాస్తూ ఉంటారు. అంతే కానీ వయసయిపోయినా జనాల చప్పట్ల కోసం వెంపర్లాడే హీరో లాగ రాసే ఇంకొంతమందీ ఉంటారు.

నెమలికన్ను మురళీ గారు మొదటికోవ కి చెందుతారు. ఆయన రాతలు ఎన్ని సార్లు చదివినా బోరు కొట్తవు. రాయలేను అనుకున్నప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుని తనలో రాయగలిగే శక్తి వచ్చిందీ నుకున్నప్పుడే మరలా మొదలుపెట్టారు.

ఇంకొంతమంది ఉంటారు తాము ఒకప్పుడు చప్పట్లు కొట్తించుకున్న బాపతు కాబట్టి అదే లెవెల్ ల్లో అన్ని తపాలూ రాయాలని ప్రయత్నించి బొక్కబోర్ల పడుతూ ఉంటారు.

చీమిడీ ముక్కు ని "గంగా గోదావరి "కాలువలగా అభివర్ణించడం లాంటి పిచ్చి కామెడీ తో జనాల బుర్రలు తినెస్తూ ఉంటారు. లేదా అప్పుడెప్పుడో చేతకాక ఆపేసిన కళల గురించి కూడా పేద్ద బిల్డప్పు ఇచ్చేసి రాసేసి అదో టపా అనుకునే ఘనులు వీరు.

అసలు ఈ కామెంట్లు ఉన్నాయే ఇవి అసలు మ్యాచ్ ఫిక్సింగ్ కంటే ఘోరం. సరుకు లేకపోయినా కొన్ని బ్లాగుల్లో కుప్పల కామెంట్లు. రాసిన కొంచమైనా మేటర్ తో రాసే ఇండియన్ మినర్వా లాంటి బ్లాగులని పట్టించుకునే నాధుడే ఉండడు.
పేరున్న బ్లాగర్ ఒక కవిత(?) రాస్తే దానికి ఆహా ఓహోలు, తన ప్రేమ గురించి అంత కన్నా బాగా రాసుకునే ఓ ప్రేమికుడి బ్లాగు కామెంట్ల సెక్షన్ మాత్రం ఖాళీ.

అన్నంతో ఆవడలు,కుంకుడుకాయ కారపు పచ్చడులు రాసే బ్లాగర్లు కోకొల్లలు. కానీ ఇదే వంట జ్యోతి గారు రాస్తే వీరతాళ్ళు, ఇంకో బ్లాగులో వస్తే కామెంట్లు పెట్తే నాధుడే ఉండడు పాపం.

5 comments:

  1. ""ఇదే వంట జ్యోతి గారు రాస్తే వీరతాళ్ళు, ఇంకో బ్లాగులో వస్తే కామెంట్లు పెట్తే నాధుడే ఉండడు పాపం.""

    త్రినేత్రుడు గారూ బ్లాగులు,బ్లాగర్ల తీరు తెన్నుల గురించి మీ త్రినేత్రం చేసిన విశ్లేషణకు హాట్స్ ఆఫ్ అండీ..ఇప్పటి బ్లాగుల పరిస్థితులను చాలా బాగా చెప్పారు కానీ నిజం నిప్పులాంటిదండీ
    ఇంతకుముందు నేను కూడా మీరు చెప్పిన విషయాలన్నీ గమనించాను కానీ ఇప్పుడు పట్టించుకోవటం లేదు లెండి.
    మీకు మాత్రం All The Best..

    ReplyDelete
  2. "తన ప్రేమ గురించి అంత కన్నా బాగా రాసుకునే ఓ ప్రేమికుడి బ్లాగు కామెంట్ల సెక్షన్ మాత్రం ఖాళీ."
    మీరు ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. చాలమటుకు ఇలా సొంత అనుభవాలు గురించి రాసుకున్నప్పుడు comment చెయ్యకపోవడానికి కారణం -may be too much personal కదా.. comment చేస్తే ఎలా తీసుకుంటారో అని సందేహం కూడా అవ్వొచ్చు కదా? అలోచించండి!

    ReplyDelete
  3. సందీప్ గారూ,

    మీరు రాసినది చూసాను. అవును ఈ గ్రూపిజం నే నేనూ ప్రశ్నించేది. నేను అడిగినంత మాత్రాన ఏమీ ఒరగదు లెండి కానీ నాకూ ఓ బ్లాగుంది బాకట్టి రాసుకోవడం అంతే.

    కాలేజీ పిల్లలు అంటే అనుకోవచ్చు ఈ గ్రూపులూ అవీను. ఇంత వయసొచ్చాకా కూడా ఈ బుద్ధులేనా అని చిరాకు కూడా వస్తుంది ఒకోసారి

    జలతారు వెన్నెల గారూ,
    >>may be too much personal కదా.. comment చేస్తే ఎలా తీసుకుంటారో అని సందేహం కూడా అవ్వొచ్చు కదా? అలోచించండి

    అదే విషయాన్ని వేరొకళ్ళు రాస్తే స్పందిస్తారు కదా స్వవిషయం అయినా కానీ ....Can you say NO?

    శర్మ గారూ,

    ధన్యవాదాలండీ

    ReplyDelete
  4. ఈ మధ్య బ్లాగుల్లో కెలుకుడు లేక మరీ బోరు కొడతాంది బెదరూ.. ఇహ మొదలెట్టు!

    అద్సరేగానీ, కామెంటెట్టడం కష్టంగా వుంది.. change the moderation..

    ReplyDelete